Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లి - తేనె మిశ్రమాన్ని పరగడుపున తీసుకుంటే?

వంటింట్లో అందుబాటులోవుంటే వస్తువుల్లో వెల్లుల్లి ఒకటి. ఇది ఓ దివ్యౌషధంగా కూడా పని చేస్తుంది. అలాంటి వెల్లుల్లిని పరగడుపున తేనెతో కలిసి తీసుకున్నట్టయితే అనేక ఫలితాలు ఉంటాయని గృహ వైద్య నిపుణులు సూచిస్తు

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (15:33 IST)
వంటింట్లో అందుబాటులోవుంటే వస్తువుల్లో వెల్లుల్లి ఒకటి. ఇది ఓ దివ్యౌషధంగా కూడా పని చేస్తుంది. అలాంటి వెల్లుల్లిని పరగడుపున తేనెతో కలిసి తీసుకున్నట్టయితే అనేక ఫలితాలు ఉంటాయని గృహ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకున్నట్టయితే రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ (బ్లాక్) కట్టకుండా చూస్తుంది. అలాగే రక్తనాళాల్లో పేరుకునిపోయివుండే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. 
 
జీర్ణాశయ, ఉదర సంబంధ సమస్యలను సులభంగా తొలగిస్తుంది. డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.
 
వెల్లుల్లి - తేనె మిశ్రమాన్ని దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటి వాటికి పూయడం వల్ల అవి వెంటనే తొలగిపోతాయి. శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
 
వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తీసుకుంటే శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శక్తి గణనీయంగా పెరుగుతుంది. వీటిలో ఉండే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. ఫలితంగా చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments