Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరూరించే స్టఫ్‌డ్ గులాబ్‌జామ్.. తయారీ విధానం..?

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (11:34 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - ఆరు
కోవా - 3 స్పూన్ల్
డ్రైఫ్రూట్స్ - 2 స్పూన్స్
చక్కెర - 1 స్పూన్
యాలకుల పొడి - పావు స్పూన్
నెయ్యి - వేయించడానికి సరిపడా
పాకం కోసం - చక్కెర
నీళ్లు - అరకప్పు
 
తయారీ విధానం:
ముందుగా చక్కెర పాకం చేసి పెట్టుకోవాలి. ఇందుకోసం ఓ గిన్నెలో నీళ్లు, చక్కెర తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. తీగపాకం వచ్చేవరకు ఉంచి ఆ తరువాత దింపేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసులు అంచుల్ని తీసేసి ఒక్కోదానిపై కొద్దిగా నీళ్లు చల్లి అప్పడాల కర్రతో వత్తినట్లు చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోవా, డ్రైఫ్రూట్స్ పలుకులు, చక్కెర, యాలకుల పొడి తీసుకుని చెంచా నీళ్లు చల్లి పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని బ్రెడ్ ‌స్ట్లైసు మధ్యలో ఉంచి అంచుల్ని మూసేయాలి. ఆ తరువాత ఉండ వచ్చేలా చేత్తో గట్టిగా నొక్కినట్లు చేసుకోవాలి. అప్పుడే డ్రైఫ్రూట్స్ మిశ్రమం ఇవతలకు రాకుండా ఉంటుంది. ఇలా మిగిలిన స్లైసుల్నీ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి ఒక్కో ఉండను వేయించి తీసుకోవాలి. కొద్దిగా వేడి చల్లారాక చక్కెర పాకంలో వేసి 5 నిమిషాల తరువాత తీసేయాలి. అంతే నోరూరించే స్టఫ్‌డ్ గులాబ్‌జామ్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments