Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొబ్బట్లు ఎలా చేయాలో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (11:18 IST)
బెల్లంలోని పోషకాలు అలసట, ఒత్తిడిని తొలగిస్తాయి. తద్వారా శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది. బెల్లంలోని మినరల్స్, న్యూట్రియన్ ఫాక్ట్ కంటి చూపుకు చాలా మంచివి. ఇలాంటి బెల్లంతో బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
శెనగపప్పు - పావుకిలో 
బెల్లం - పావుకిలో
పచ్చికొబ్బరి - అరకప్పు
నెయ్యి - పావుకిలో
మైదాపిండి - 200 గ్రా
యాలకులు - 10
నూనె - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా మైదాపిండిని కొద్దిగా నీళ్లతో కలుపుకుని నూనెలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు శెనగపప్పులను కుక్కర్లో మెత్తగా ఉడికించి అందులో బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కాసేపటి తరువాత దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని ఉండల్లా చేసుకుని నెయ్యిరాసి దాని మధ్యలో పూర్ణం ఉండ పెట్టుకుని నాలుగువైపులా మూసేసి చేత్తో చపాతిలా మెల్లగా ఒత్తుకోవాలి. ఆ తరువాత పెనంపై నెయ్యి వేసి బొబ్బట్టును వేసి దోరగా రెండు వైపులా వేయించుకోవాలి. అంతే... బొబ్బట్లు రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

Heavy rains: హైదరాబాద్ అంతటా భారీ వర్షపాతం.. ఆగస్టు 9వరకు అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments