Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాష్టమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి..

కృష్ణాష్టమి నాడు భక్తుడు శ్రీకృష్ణుడిని నిష్ఠతో పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణున్ని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి,

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (15:18 IST)
కృష్ణాష్టమి నాడు భక్తుడు శ్రీకృష్ణుడిని నిష్ఠతో పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణున్ని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.
 
శ్రీకృష్ణాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితంతో పాటు కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం శ్రీకృష్ణాష్టమి. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే లేచి, తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. 
 
ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజ మందిరాల్లో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధం, తులసి మాల, శ్రీ కృష్ణుడి విగ్రహం, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరంను ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో ఉన్న ఫోటోను గానీ, ప్రతిమను కానీ ఉంచాలి. 
 
కంచు దీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమత్భావగతములతో శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

లేటెస్ట్

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఈ రంజాన్ మాసంలో దుబాయ్‌లో ఐదు ముఖ్యమైన ఇఫ్తార్ ప్రదేశాలు

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. సూపర్ ఫలితాలు

06-03-2025 గురువారం దినఫలితాలు - కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

తర్వాతి కథనం
Show comments