ఉపవాసం ఉంటే.. నిత్యయవ్వనులుగా ఉంటారట.. బరువు కూడా తగ్గుతారట..
ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే అమెరికా యూనివర్శిటీ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే? నిత్యం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారికి ఉపవాసానికి మించిన మందు మరొకటి లేదంట
ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే అమెరికా యూనివర్శిటీ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే? నిత్యం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారికి ఉపవాసానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. వయసుతో పాటు వచ్చే దుష్ప్రభావాలను దూరం చేసుకోవాలంటే.. ఉపవాసం ఉండాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు.
ఎలుకలపై జరిగిన పరిశోధనలో ఈ విషయం తేలిందని పరిశోధకులు అంటున్నారు. కొన్ని ఎలుకలకు కొన్ని రోజుల పాటు తక్కువ ఆహారాన్ని.. మరికొంత కాలం ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని అందించారు. తక్కువ ఆహారం తీసుకున్న ఎలుకలు బరువు తగ్గడంతో పాటు అంతకుముందు కంటే ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా కనిపించాయని పరిశోధకులు గుర్తించారు.
వీటి కణాల ఉత్పత్తిలోనూ మార్పు కనిపించిందని గుర్తించారు. ఇదేవిధంగా మానవులు కూడా తక్కువ ఆహారాన్ని లేదా ఉపవాసం ఉండటం ద్వారా బరువు తగ్గడం.. నిత్య యవ్వనులుగా ఉంటారని పరిశోధనలో వెల్లడైంది. ఉపవాసం ఉంటే.. వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేగాకుండా.. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాన్సర్‌ను తరిమికొడుతుందని, బరువును తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.