స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు, టీవీలకు పిల్లలు అతుక్కుపోతే.. అదీ 3 గంటలు మించితే?
స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లకు తోడు టీవీల్లో బొమ్మల సినిమాలంటేనే పిల్లలకు ఆసక్తి ఎక్కువ. అయితే తొమ్మిది నుంచి పది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు మూడు గంటలకు మించి టీవీ చూస్తే మాత్రం డయాబెటిస్ బారిన పడే
స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లకు తోడు టీవీల్లో బొమ్మల సినిమాలంటేనే పిల్లలకు ఆసక్తి ఎక్కువ. అయితే తొమ్మిది నుంచి పది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు మూడు గంటలకు మించి టీవీ చూస్తే మాత్రం డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆన్ లైన్ జర్నల్ ‘ఆర్చివ్స్’ లోని ‘డిసీజ్ ఇన్ చైల్డ్ హుడ్’లో పరిశోధకులు తెలిపారు.
టీవీలు మాత్రమే కాకుండా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను గంటల తరబడి ఉపయోగించే పిల్లలకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే మూడు గంటలకు మించి పిల్లల్ని టీవీ, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోనీయకుండా చూసుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజూ మూడు గంటల కంటే ఎక్కువ సమయం తాము టీవీ చూస్తుంటామని ఐదుగురు పిల్లల్లో ఒకరు అంటే 18 శాతం పేర్కొన్నట్లు పరిశోధకులు తెలిపారు. తొమ్మిది నుంచి పదేళ్ల లోపు ఉన్న అమ్మాయిలు.. అబ్బాయిలు టీవీ, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను గంటల పాటు వాడకపోవడం మంచిది. ముఖ్యంగా మూడు గంటలకు పైబడితే మాత్రం డయాబెటిస్ తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
లండన్‌లోని బర్మింగ్ హామ్, లిసెస్టర్‌లోని రెండు వందల ప్రాథమిక పాఠశాలల్లో 9-10 సంవత్సరాల మధ్య వయసు గల సుమారు 4,500 మంది పిల్లలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రోజుకు 3 గంటలకు పైబడి టీవీ, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు వాడే పిల్లల్లో బీపీ, బాడీ ఫ్యాట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతున్నాయని తేలినట్లు పరిశోధకులు అంటున్నారు.