Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ నవమి.. రామబంటుకు సింధూరం.. సీతారామ కళ్యాణాన్ని వీక్షితే..

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (09:47 IST)
శ్రీరామ నవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీరాముడు జన్మించిన పవిత్రమైన రోజున శ్రీరామ నవమి వేడుకలుగా జరుపుకుంటారు. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని.. అందుకే ఈరోజున పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహిస్తారు. ఈ సమయంలో శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
 
ఇదిలా ఉండగా.. శ్రీరామ నవమి రోజున రామ రక్ష స్తోత్రాన్ని పఠించాలి. శ్రీరాములోరికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే శ్రీరామనవమి రోజున రామాయణ పారాయణం చేయడం ద్వారా శ్రీరాముడి అనుగ్రహం పొందవచ్చు. రాముడిని పూజించడం ద్వారా ఆయన భక్తుడైన హనుమంతుడు కూడా సంతసిస్తాడు. శ్రీరామ నవమి రోజున ఆంజనేయునికి సింధూరం సమర్పించాలి. 
 
సీతారాములకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి.  ఈరోజున సుందరకాండను కూడా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగాజలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకుని ‘ఓం శ్రీ హ్వీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున ఆలయాల్లో జరిగే సీతారామ కల్యాణ ఉత్సవాన్ని కనులారా వీక్షించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

తర్వాతి కథనం
Show comments