Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ కుటుంబసభ్యులతో కలిసి ఉగాది పండుగకు సిద్ధం కావడానికి అతి సులభమైన పద్ధతులు

telugu ugadi
, సోమవారం, 20 మార్చి 2023 (22:55 IST)
భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పండుగలలో ఉగాది ఒకటి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ పండుగను వేడుకగా జరుపుకుంటుంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం ఇది నూతన సంవత్సరారంభం. బ్రహ్మ, ఈ రోజున ఈ విశ్వాన్ని సృష్టించాడనేది హిందూ పురాణాలు నమ్మిక. అందువల్ల యుగాది అని కూడా చెబుతుంటారు. సంపద, ఆరోగ్యం, సంక్షేమం కోసం ఈ పండుగ రోజున ప్రజలు ప్రార్ధిస్తుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ పండుగను వేడుక చేస్తుంటారు.
 
ఉగాది పండుగ రోజున వేప పువ్వు పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే! తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు రుచులను మిళితం చేసుకున్న ఈ పచ్చడిలాగానే జీవితం కూడా ఉండాలని కోరుకునే వారెందరో! ఈ పండుగ వేళ ఇంటిని శుభ్రం చేసుకుంటుంటారు. చాలామంది వేప గుణాలు కలిసిన నిమిల్‌ ఫ్లోర్‌ క్లీనర్‌లనూ వినియోగించి సీజన్‌ మారిన వేళ ఇళ్లలో చేరే బ్యాక్టీరియానూ పొగొట్టుకుంటంటారు. నిజానికి భారతీయ పండుగలలో వేపకు ప్రత్యేక స్ధానముందని, అదే తనను నిమిల్‌ వైపు చూసేందుకూ తోడ్పడుతుందని, ఇక ఉగాది పండుగ వేళ తనకెన్నో మధురస్మృతులు ఉన్నాయన్నారు ఉపాధ్యాయురాలు నయన. పండుగ వేళ ఇంటిని శుభ్రపరుచుకోవడంతో పాటుగా ఇంటిల్లిపాది కొత్త బట్టలు ధరించి పండుగను సంతోషంగా జరుపుకుంటామన్నారు.
 
ఈ పండుగ వేళ మీ ఇల్లు వాసన, మురికి లేదంటే మరకలు లేకుండా ఉండాలంటే ఏం చేయవచ్చంటే...
 
ఫ్లోర్‌ క్లీనింగ్‌ కోసం- ఇంటిలో అడుగుపెట్టగానే కనిపించేది ఫ్లోర్‌  కాబట్టి సహజసిద్ధమైన ఫ్లోర్‌ క్లీనర్‌లను వినియోగించడం మంచిది. మరీముఖ్యంగా ఇంటిలో పెంపుడు జంతువులు, పిల్లలు ఉంటే ఈ క్లీనింగ్‌ ఉత్పత్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలి.
 
చిన్నారుల గదులను మృదువైన క్లీన్సర్‌లను వాడి శుభ్రపరచాలి. యాంటీ బ్యాక్టీరియల్‌,  యాంటీహిస్టమైన్‌లక్షణాలు కలిగిన ఉత్పత్తులు వాడితే వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.
 
కర్టెన్‌లకు దుమ్ము ఎక్కువగా పట్టుకుని ఉంటుంది కాబట్టి కనీసం నాలుగు నెలలకోమారు అయినా శుభ్రపరచాలి. పండుగ వేళ మారిస్తే మరింత ఆహ్లాదాన్ని పంచుతాయి.
 
ఇంటిలో మురికి ప్రదేశాలలో బాత్‌రూమ్‌లు కూడా ఒకటి. సహజసిద్ధమైన క్లీన్సర్‌లను వాడి ముందు సింక్‌, టాయ్‌లెట్‌ శుభ్రపరిచి తరువాత  బాత్‌రూమ్‌ ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తే ఫలితాలు బాగుంటాయి.
 
వంటగదిని శుభ్రపరచడానికి నిమ్మవాడవచ్చు. వినిగర్‌, నిమ్మ కలిపి వాడితే వంటగదిలో మరకలు పోగొట్టవచ్చు.
 
ఇల్లంతా శుభ్రపరుస్తాం కానీ గది మూలలు వచ్చేసరికి మరిచిపోతుంటాం.  చాలావరకూ సమస్యలకు ఇది కారణమవుతుంది కాబట్టి  మీ ఫ్లోర్‌ క్లీన్‌ చేసినప్పుడు మూలలు (కార్నర్స్‌ ) కూడా క్లీన్‌ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో