Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుఎస్ ఓపెన్ విజేత స్పెయిన్ బుల్... కెరీర్‌లో 74 సింగిల్స్‌ టైటిల్‌

క్లే కోర్టు రారాజుగా పేరొందిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌‌ టోర్నీలో హార్డ్‌కోర్టులోనూ యూఎస్‌ ఓపెన్‌ విజేతగా అవతరించాడు. కెరీర్‌లో 31 ఏళ్ల వయస్సులో స్వీట్‌ సిక్స్‌ టీన్‌ 'గ్రాండ

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (06:49 IST)
క్లే కోర్టు రారాజుగా పేరొందిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌‌ టోర్నీలో హార్డ్‌కోర్టులోనూ యూఎస్‌ ఓపెన్‌ విజేతగా అవతరించాడు. కెరీర్‌లో 31 ఏళ్ల వయస్సులో స్వీట్‌ సిక్స్‌ టీన్‌ 'గ్రాండ్‌' టైటిల్‌తో న్యూయార్క్‌లో మెరిశాడు. ఏకపక్షంగా సాగిన చివరి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో నెం:1 సీడ్‌ నాదల్‌ దక్షిణాఫ్రికాకు చెందిన 28వ సీడ్‌ కెవిన్‌ అండర్సన్‌ను 6-3,6-3,6-4తో ఓడించాడు. 
 
దీంతో కెరీర్‌లో 16 గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకోవడంతోపాటు మూడో యూఎస్‌ ఓపెన్‌ను నాదల్‌ సాధించాడు. అంతకుముందు న్యూయార్క్‌ వేదికగా 2010, 2013ల్లో ఈ టైటిల్‌ను సాధించాడు. అతని కెరీర్‌లో 2017 కీలకమైన మరుపురాని సంవత్సరంగా నిలిచిపోనుంది. ఈ యేడాదిలో నాదల్‌కు ఇది ఐదో టైటిల్‌ కావడం గమనార్హం. 
 
ఓవరాల్‌గా ఇది 74 టైటిల్‌. భారీ ప్రైజ్‌మనీ 3.7 మిలియన్‌ల యూరోలను సొంతం చేసుకున్నాడు. 31 ఏళ్ల నాదల్‌ ఇక స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు 19 సాధనపైనే గురి పెట్టాల్సి ఉంటుంది. పీట్‌ సంప్రాస్‌ 16 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును నాదల్‌ సమం చేశాడు. సెర్బియా స్టార్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ 12 గ్రాండ్‌స్లామ్‌లతో మూడో స్థానంలో నిలిచాడు. 
 
2017లో నాదల్‌ టైటిళ్లు:
యూఎస్‌ ఓపెన్‌ (హార్డ్‌కోర్టు), ఫ్రెంచ్‌ ఓపెన్‌( క్లే కోర్టు), ఏటిపి వరల్డ్‌ టూర్‌ మాస్టర్స్‌ 100 మాడ్రిడ్‌( క్లే కోర్టు), బార్సిలోనా (క్లే కోర్టు), మోంటో కార్లో (క్లే కోర్టు)
 
16 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఇవే..
ఆస్ట్రేలియా ఓపెన్‌(1) : 2009
ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు(10) : 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017
యూఎస్‌ ఓపెన్‌ (3) : 2010, 2013, 2017

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థి తండ్రితో టీచరమ్మ పరిచయం - అఫైర్.. ఆపై రూ.20 లక్షల డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments