టోక్యో ఒలింపిక్స్ : భారత్‌కు మిశ్రమ ఫలితాలు.. టీటీలో 3వ రౌండ్‌కు ఎంట్రీ

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (16:37 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత క్రీడాకారులు పలు పోటీల్లో బరిలోకి దిగారు. వీరిలో మేరీకోమ్, పీవీ సింధు కూడా ఉన్నారు. ఇప్పటికే సింధుతో పాటు.. మేరీకోమ్ ఆదివారం తమ సత్తా చూపించి తమతమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఆ తర్వాత టేబుల్ టెన్నిస్ టోర్నీలో మణికా బాత్రా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. 
 
ఈ టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా, ఆదివారం, భారత ఆటగాళ్లు బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, స్విమ్మింగ్ విభాగాల్లో తమ ప్రతిభను చాటారు. అలాగే, సెయిలింగ్, బోటింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్‌లో బరిలోకి దిగనున్నారు. ఆదివారం జరిగిన పోటీల వివరాలను పరిశీలిస్తే,
 
* రోయింగ్‌ విభాగంలో భారత్‌ శుభారంభం చేసింది. లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ రెపికేజ్‌లో రోవర్స్‌ అర్జున్‌ లాల్‌-అర్వింద్‌ సింగ్‌ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో భారత్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
 
* మహిళల టెన్నిస్‌ విభాగంలో సానియా జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జా-అంకిత రైనా జోడీ లిడ్‌మిలా-నదియా(ఉక్రెయిన్‌) జంట చేతిలో ఓడిపోయింది.
 
* మహిళల 10 మీ ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్‌, యశస్విని 12 వ స్ధానంలో నిలిచారు. దీంతో భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
 
* మహిళల ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) 32 వ రౌండ్‌లో భారత్ స్టార్ బాక్సర్ మేరీకోమ్ విజయం సాధించింది. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మిగ్యులినా హెర్నాండెజ్ గార్సియాను 4-1తో ఓడించి, తదుపరి రౌండ్‌లోకి ఎంటరైంది.
 
* మహిళల సింగిల్స్ రౌండ్‌లో మణికా బాత్రా 4-11, 4-11, 11-7, 12-10, 8-11, 11-5, 11-7తో ఉక్రెయిన్ క్రీడాకారిణి మార్గరైటా పెసోట్స్కా‌పై గెలిచింది దీంతో బాత్రా 3వ రౌండ్‌లోకి ప్రవేశించింది.
 
* ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో ఇండియా ప్లేయర్ జ్ఞానేశ్వ‌రన్ స‌త్య‌న్ ఓడిపోయాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో త‌న కంటే త‌క్కువ ర్యాంక్ క్రీడాకారుడు, హాంకాంగ్‌కు చెందిన లామ్ సియు హాంగ్ చేతిలో 7-11, 11-7, 11-4, 11-5, 10-12, 9-11, 6-11 తేడాతో పరాజయం పాలయ్యాడు.
 
* దీపక్ కుమార్, దివ్యన్ష్ పన్వర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. 624.7 పాయింట్లతో దీపక్ 26 వ స్థానంలో, 622.8 పాయింట్లతో దివ్యాన్ష్ పన్వర్ 32వ స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన యాంగ్ హొరాన్ 632.7 పాయింట్లతో ఒలింపిక్ రికార్డు సృష్టించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments