Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల ప్రచారంలో డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్...?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (18:18 IST)
ఈ సార్వత్రిక ఎన్నికల్లో సినీతారలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. అయితే సినీ తారలే కాకుండా వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు. డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్ గ్రేట్ ఖలీ ఎన్నికల ప్రచారంలో తళుక్కున మెరిశారు. తన స్నేహితుని తరపున ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. ఇది పశ్చిమ బెంగాలోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో కనిపించిన సీన్. 
 
బీజేపీ ఎంపీ అభ్యర్థి, తన స్నేహితుడు అనుపమ్ హజ్రా తరఫున గ్రేట్ ఖలీ ప్రచారం చేశారు. అనుపమ్ హజ్రా తృణమూల్ కాంగ్రెస్‌లో ఉండి బహిష్కరణకు గురయ్యాడు. బోల్‌పూర్ ఎంపీ అయిన అనుపమ్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో బహిష్కరించారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 
 
ఈ సందర్భంగా జరిగిన రోడ్డు షోలో ఖలీ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖలీ తనకు మంచి స్నేహితుడని, తనకోసం కోల్‌కతా వచ్చాడని అనుపమ్ చెప్పారు. సాంప్రదాయ రాజకీయ నేతల చేసే ప్రచారం అంటే తనకు ఇష్టం లేదని, అందుకే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, యువతకు స్ఫూర్తిగా ఉండే ఖలీని ఆహ్వానించానని తెలిపారు. అనుపమ్ హజ్రాపై పోటీగా తృణమూల్ తరఫున ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తి నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments