Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకుపోయిన 12మంది చిన్నారులు... (వీడియో)

థాయ్‌లాండ్‌లో ట్రెక్కింగ్ శిక్షణ కోసం వెళ్లిన 12 మంది చిన్నారులు గుహలోకి చిక్కుకుపోయారు. తొమ్మిదిరోజుల పాటు గుహలోనే గడిపారు. పదో రోజున వారి ఆచూకీ తెలియవచ్చింది. ఓ లోతైన గుహలో చిక్కుకుపోయి బయటకు రాలేక

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (16:02 IST)
థాయ్‌లాండ్‌లో ట్రెక్కింగ్ శిక్షణ కోసం వెళ్లిన 12 మంది చిన్నారులు గుహలోకి చిక్కుకుపోయారు. తొమ్మిదిరోజుల పాటు గుహలోనే గడిపారు. పదో రోజున వారి ఆచూకీ తెలియవచ్చింది. ఓ లోతైన గుహలో చిక్కుకుపోయి బయటకు రాలేక అక్కడే గడుపుతున్న థాయ్ యూత్ ఫుట్ బాల్ టీమ్‌లోని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నట్టు తెలియజేస్తూ ఓ వీడియో విడుదలైంది. 
 
ఓ గుహలో మట్టి, బురదనీరు మధ్య వీరంతా చిక్కుకుపోయి, ఆకలితో అలమటిస్తున్నారు. తమకు కనీస ఆహారం పంపాలని వేడుకున్నారు. థాయ్ నేవీ సీల్స్ విడుదల చేసిన ఈ వీడియోలో ఫుట్ బాల్ జర్సీలు ధరించిన వీరంతా మోకాళ్లపై కూర్చుని.. ఆకలిబాధతో పాటు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోమవారం నాడు తీశామని చెబుతూ నేవీ సీల్స్ తన ఫేస్ బుక్ అధికార పేజీలో వీడియోను పోస్ట్ చేసింది.
 
ఈ వీడియోలో గుహలోకి వెళ్లిన డైవర్, బ్రిటిష్ ఇంగ్లీష్ యాసతో మాట్లాడుతూ, మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడకు చాలామంది రానున్నారని, తొలుత తాను వచ్చానని, అందరినీ బయటకు తీసుకెళ్తామని చెప్పాడు. జూన్ 23, శనివారం నుంచి వీరంతా గుహలో చిక్కుకుపోయి ఉన్నారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments