అమ్మాయిలు ఆటలాడితే అందవిహీనంగా మారుతారా? సానియా ఏమంటోంది?

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (08:36 IST)
అమ్మాయిలు ఆటలాడితే అందవిహీనంగా మారుతారా? ఈ విషయంపై అనేక మంది ఇదే అపోహలో ఉంటారు. కానీ, అలాంటిదేమీ లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో "మహిళలు-లింగవివక్ష" అనే అంశంపై సానియా మీర్జా మాట్లాడారు.
 
ఈ సందర్భంగా ఆమె తన మనసులోని విషయాలను తేటతెల్లం చేశారు. 'బాల్యంలో తాను టెన్నిస్ క్రీడను ఎంచుకున్నప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు చాలా నిరుత్సాహ పరిచారు. అమ్మాయిలు ఆటలు ఆడితే నల్లగా మారిపోయి, అందవిహీనంగా తయారవుతారని చెప్పారు. నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరని భయపెట్టేవాళ్లని వివరించారు. 
 
ఆ సమయంలో తన వయసు కేవలం ఎనిమిదేళ్లు మాత్రమేనని గుర్తు చేసిన సానియా... అప్పటికి తాను చిన్నపిల్లనే కాబట్టి ఇవేం పట్టించుకోరాదని ఆ సమయంలో నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను అలాంటి అభిప్రాయాలకు అప్పుడే కాదు ఎప్పుడూ విలువ ఇవ్వలేదని, ఆటపైనే దృష్టి పెట్టానని వెల్లడించారు. ఎందుకోగానీ, ఇలాంటి అభిప్రాయాలు మన సంస్కృతిలో బాగా పాతుకుపోయాయని, ఈ పద్ధతిలో మార్పురావాలని సానియా మీర్జా అభిప్రాయపడ్డారు. 
 
పైగా, క్రీడల ఆసక్తి చూపే అమ్మాయిలను తల్లిదండ్రులే ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అపుడే అమ్మాయిలు క్రీడల్లో బాగా రాణిస్తారని సానియా గుర్తు చేశారు. ఈ విషయంలో తన తల్లిదండ్రులే మంచి ఉదాహరణ అని ఆమె గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments