Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మ భూషణ్ అవార్డును స్వీకరించిన పీవీ సింధు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (12:48 IST)
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా హైద‌రాబాదీ ప్లేయ‌ర్‌, వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌ పీవీ సింధు సోమవారం ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డును అందుకున్నారు. 2020 సంవ‌త్సరానికి గాను ఈ అవార్డు ఆమెను వ‌రించింది. 
 
ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ఆమె ఆ అవార్డును స్వీక‌రించారు. ఒలింపిక్ ప్లేయ‌ర్ పుస‌ర్ల వెంక‌ట సింధు రియోలో జ‌రిగిన ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ ప‌త‌కం గెల‌వ‌గా.. ఇటీవ‌ల టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడ‌ల్‌ను గెలుచుకున్న‌ది. 2015లో సింధుకు ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది.
 
అలాగే, ఎయిర్ మార్ష‌ల్ డాక్ట‌ర్ ప‌ద్మ భందోపాధ్యాయ వైద్య రంగంలో ప‌ద్మ‌శ్రీ అవార్డును గెలిచారు. రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది ప్ర‌భుత్వం 119 ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దాంట్లో ఏడు ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ది ప‌ద్మ‌భూష‌ణ్‌, 102 ప‌ద్మ‌శ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డులు అందుకున్న‌వారిలో 29 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మ‌రో 16 మందికి మ‌ర‌ణానంత‌రం అవార్డుల‌ను ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుంభమేళాతో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందంటున్న సీఎం యోగి.. ఎలా?

మరో కేసులో పోసానికి 14 రోజుల రిమాండ్ : కర్నూలు కోర్టు ఆదేశం

SSC Hall Tickets: విద్యార్థులకు నేరుగా వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్లు

కేబినేట్‌లోనూ లేదు.. ఎమ్మెల్సీనీ కాదు.. కార్పొరేషన్ చైర్మన్‌గా నాగబాబు..?

కాబోయే భార్యతో ఉరివేసుకున్నట్టుగా సెల్ఫీ దిగిన యువకుడు.. విషాదాంతంగా ముగిసిన ఫ్రాంక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

తర్వాతి కథనం
Show comments