Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన సాత్విక్ - చిరాగ్ శెట్టి

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (13:17 IST)
భారత టాప్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన తొలి భారత డబుల్స్ జంటగా రికార్డులకెక్కారు. గతంలో సైనా (2010, 2012), శ్రీకాంత్ (2017) ఇండోనే సియా ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ సాధించారు. 
 
ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో వరల్డ్ నెం:6 సాత్విక్-చిరాగ్ ద్వయం 21-17, 21-18తో మలేసియాకు చెందిన వరల్డ్ చాంపి యన్లు ఆరోన్ చియా - సొ వూయి యిక్‌పై వరుస గేముల్లో విజయం సాధించారు. గతంలో ఈ జంటతో ముఖాముఖి పోరులో 0-8తో పేలవ రికార్డున్న సాత్విక్ జోడీ. ఈసారి అద్భుత రీతితో పోరాడింది. 13 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వ్యూహాత్మకంగా ఆడుతూ మలేసియా జోడీపై తొలి విజయాన్ని నమోదు చేసింది. 
 
మొదటి గేమ్ ఆరంభంలో సాత్విక్ జోడీ 3-5తో వెనుకబడిన తర్వాత పుంజుకొంది. వరుసగా 6 పాయింట్లు సాధించిన భారత ద్వయం 11-9తో బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను తమ ఖాతాలో వేసుకొంది. ఇక రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వానేనా అన్న ట్టుగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగినా ప్రత్యర్థికి సాత్విక్ జోడీ పుంజుకొనే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తమ వశం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments