Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెస్ట్ మహా సంగ్రామంలో కంగారులదే విజయం - చిత్తుగా ఓడిన భారత్

australia test team
, ఆదివారం, 11 జూన్ 2023 (18:31 IST)
లండన్ వేదికగా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వవిజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. రెండుసార్లు ఫైనల్‌కు వెళ్ళిన టీమిండియా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ గదను మాత్రం అందుకోలేకపోయింది. పేలవ ప్రదర్శనతో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా మహా సమరంలో ఆస్ట్రేలియా జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. 
 
వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఈ సారైన టైటిల్‌ గెలిచి ఐసీసీ ట్రోఫీల కరవును తీర్చుతుందన్న అభిమానుల ఆశలపై రోహిత్‌ సేన నీళ్లు చల్లింది. అన్ని రంగాల్లో విఫలమై.. కీలకమైన పోరులో మరోసారి తడబాటుకు గురై 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీ భారత్‌కు కలగానే మిగిలిపోయింది. 
 
ఆసీస్‌ నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో 164/3తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ ఇండియా.. ఆసీస్‌ బౌలింగ్‌ ధాటికి నిలువలేకపోయింది. తొలి సెషన్‌లో మరో 70 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. రికార్డు ఛేజింగ్‌లో ఆశలు రేపిన కోహ్లీ, రహానె వికెట్లు పడిపోవడంతో.. టీమ్‌ఇండియా పతనం ప్రారంభమైంది. 
 
అర్థశతకానికి చేరువలో కోహ్లీ(49) బోలాండ్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన జడేజా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. రహానె(46) కూడా ఆ తర్వాత ఎక్కువ సేపు నిలవలేదు. స్టార్క్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ కారేకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌ ఎల్బీగా దొరికిపోగా.. మ్యాచ్‌ ఆఖరులో కేఎస్‌ భరత్‌ (23) కాసేపు క్రీజ్‌లో నిలించేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు.
 
డబ్ల్యూటీసీ విజేతగా నిలవడంతో ఆస్ట్రేలియా ఐసీసీ ట్రోఫీల్లో చరిత్ర సృష్టించింది. అన్ని ఐసీసీ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా ఆసీస్‌ నిలిచింది. వన్డే ప్రపంచకప్‌, టీ20 వరల్డ్‌కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన ఆసీస్‌.. తాజాగా డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలిచి మొత్తం నాలుగు ఐసీసీ టైటిళ్లు సొంతం చేసుకున్న ఏకైక జట్టుగా అవతరించింది.
 
సంక్షిప్త స్కోరు వివరాలు.. 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 469/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296 /10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 270/8 (డిక్లేర్డ్)
భారత్ రెండో రెండో ఇన్నింగ్స్‌ : 234/10

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రసవత్తంగా టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ : భారత్‌ను ఊరిస్తున్న విజయం