Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్ సూపర్ సిరీస్ టైటిల్‌పై కన్నేసిన పీవీ సింధు.. గట్టిపోటీ దిగనుందా?

హైదరాబాదీ ఏస్ షట్లర్ పీవీ సింధు మరో టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభం కానున్న సింగపూర్ సూపర్ సిరీస్‌లో సింధు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌‌ కు సన్నద్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (08:52 IST)
హైదరాబాదీ ఏస్ షట్లర్ పీవీ సింధు మరో టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభం కానున్న సింగపూర్ సూపర్ సిరీస్‌లో సింధు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌‌ కు సన్నద్ధమౌతున్న సైనా నెహ్వాల్‌ ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. అంతర్జాతీయ సర్క్యూట్‌లో మెరుగైన ప్రదర్శనకు శిక్షణ కోసం తనకు మరింత సమయం కావాలని సైనా తెలిపింది.
 
ఇక మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా, ఈ టోర్నీలో సత్తా చాటాలని ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధు గట్టి పట్టుదలతో ఉంది. అయితే అగ్రస్థాయి షట్లర్లు కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), ప్రపంచ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), అకానె యమగుచి (జపాన్‌), సంగ్‌ జి హ్యున్‌ (కొరియా)తో సింధుకు సవాల్‌ ఎదురుకానుంది. ఇండియన్‌ ఓపెన్‌ విజేత సింధుకు కఠిన డ్రా ఎదురైంది.
 
తొలి రౌండ్లో 2016 ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ నజోమి ఒకుహర (జపాన్)తో సింధు తలపడనుంది. ఒక వేళ సింధు క్వార్టర్స్‌ చేరితో రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత మారిన్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక వర్ధమాన షట్లర్‌ రితుపర్ణ దాస్‌ తొలి రౌండ్‌లో సు యా చింగ్‌ (చైనీస్‌ తైపీ)తో పోటీపడనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మూడు దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నాం : బిలావుల్ భుట్టో

LoC: బంకర్లలో భారత సైనికుల వెన్నంటే వున్నాము, 8వ రోజు పాక్ కాల్పులు

మధుసూధన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన మంచు విష్ణు, జానీ మాస్టర్ (video)

Amaravati: అమరావతి పునః ప్రారంభం.. పండుగలా మారిన వాతావరణం

అమరావతికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కృష్ణానదిపై వంతెన ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

తర్వాతి కథనం
Show comments