Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్ గేల్‌నే దూరం పెట్టారు. అయినా ఫలితం దక్కలే.. అరుదైన రికార్డు మిస్సయ్యిన గేల్

మరొక్క 25 పరుగులు చేసి ఉంటే టీ20 చరిత్రలో అరుదైన రికార్డును సాధించేవాడా అరివీర భయంకర బ్యాట్స్‌మన్. ప్రపంచ టీ20 చరిత్రలో 10వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించే అవకాశం కనుచూపు మేరలో కనిపిస్తోంది. కాని దురదృష్టం అతడిని వెన్నాడింద

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (01:47 IST)
మరొక్క 25 పరుగులు చేసి ఉంటే టీ20 చరిత్రలో అరుదైన రికార్డును సాధించేవాడా అరివీర భయంకర బ్యాట్స్‌మన్. ప్రపంచ టీ20 చరిత్రలో 10వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించే అవకాశం కనుచూపు మేరలో కనిపిస్తోంది. కాని దురదృష్టం అతడిని వెన్నాడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోంచే అతడిని పక్కన పెట్టారు. ఐపీఎల్‌ టోర్నీలో విధ్వంసక ఆటకు మారుపేరైనా క్రిస్ గేల్ రికార్డుకు అతి సమీపంలోకి వచ్చి నిలిచిపోయాడు.
 
కెరీర్‌లో ఇప్పటి వరకు 288 టీ20లు ఆడిన గేల్‌ 9,975 పరుగులు సాధించాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా 18 శతకాలు బాదాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సోమవారం రాత్రి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తలపడినప్పుడు ఈ మ్యాచ్‌లో గేల్‌ 25 పరుగులు చేసి ఉంటే చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేవాడు. కానీ అతిడి దురదృష్టం కాబోలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన నిర్ణయం తీసుకుంది. విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను పక్కన పెట్టింది. 
 
అతని స్థానంలో సఫారీ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు డివిలియర్స్ దూరమయ్యాడు. గేల్ మరో 25 టీ 20లో 10 వేల పరుగులకు కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇండోర్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ రికార్డు సృష్టిస్తాడని అనుకున్నా అతనికి ఆ అవకాశం దక్కలేదు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments