Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ : డివీలియర్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా

అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో బెంగుళూరు ఆట కట్టించిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఐపీఎల్‌-10వ సీజన్‌లో తన జోరును కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌ను పంజాబ్ మట్టికరిపించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (01:10 IST)
అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో బెంగుళూరు ఆట కట్టించిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఐపీఎల్‌-10వ సీజన్‌లో తన జోరును కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌ను పంజాబ్ మట్టికరిపించింది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగుళూరు జట్టును 20 ఓవర్లలో 148/4 పరుగులకు కట్టడి చేసింది పంజాబ్‌. బెంగుళూరు ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు చేసిందంటే అందుకు కారణం ఏబీ డివిలియర్స్‌ (89; 46 బంతుల్లో; 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటమే. 149 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగిన పంజాబ్‌ జట్టుకు ఓపెనర్లు వోహ్రా(34; 21 బంతుల్లో), హషీమ్‌ ఆమ్లా(58; 38 బంతుల్లో) నాటౌట్‌ శుభారంభాన్నిచ్చారు.
 
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ వెంటనే వెనుదిరిగినా.. కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ (43; 22 బంతుల్లో) నాటౌట్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. దీంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ లక్ష్యాన్ని చేధించింది. పంజాబ్‌ బౌలర్లలో ఆరోన్‌కు రెండు వికెట్లు దక్కగా.. అక్షర్‌పటేల్‌, సందీప్‌ శర్మలు చెరో వికెట్‌ పడగొట్టారు. బెంగుళూరు బౌలర్లలో తైమల్‌ మిల్స్‌, ఇమ్రాన్‌ తహీర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న ఏబీ డివిలియర్స్ పరుగుల మోత మోగించాడు. సోమవారం ఇక్కడ కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డివిలియర్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. 46 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో చెలరేగి ఆడి 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒకవైపు బెంగళూరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో డివిలియర్స్ ఒంటరి పోరాటం చేశాడు. 
 
ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో కింగ్స్ పంజాబ్ బౌలర్లపై డివిలియర్స్ విరుచుకుపడ్డాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయి ఆడి అభిమానులకు పండుగ చేశాడు. బౌలర్ ఎవరైనా తన సహజసిద్ధమైన ఆట తీరుతో ప్రేక్షకులకు కనువిందు చేశాడు డివిలియర్స్. ఏబీ బ్యాటింగ్ విన్యాసాలకు కింగ్స్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

తర్వాతి కథనం
Show comments