Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజ్లర్ - ప్రియుడితో ఒలింపిక్స్‌ విజేత సాక్షిమాలిక్‌ ఎంగేజ్మెంట్

రియో ఒలింపిక్స్‌ పతక విజేత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌‌కు హర్యాణాలోని రొహ్‌తక్‌ నగరానికే చెందిన ప్రియుడు, రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియన్‌‌తో నిశ్చితార్థం జరిగింది. ఒలింపిక్ పతకం గెలిచిన అనంతరం తన ప్రేమ సంగతిన

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (09:31 IST)
రియో ఒలింపిక్స్‌ పతక విజేత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌‌కు హర్యాణాలోని రొహ్‌తక్‌ నగరానికే చెందిన ప్రియుడు, రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియన్‌‌తో నిశ్చితార్థం జరిగింది. ఒలింపిక్ పతకం గెలిచిన అనంతరం తన ప్రేమ సంగతిని సాక్షి మాలిక్ వెల్లడించిన సంగతితెలిసిందే. 
 
ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం ఈ జంటకి నిశ్చితార్థమైంది. ఈ మేరకు తమ రెండు కుటుంబాలకు చెందిన సభ్యుల సమక్షంలో జరిగిన నిశ్చితార్థ వేడుక చాలా బాగా జరిగిందని సత్యవర్త్‌ తండ్రి సత్యవాన్‌ వెల్లడించారు. 
 
కాగా, 014లో గ్లాస్గో  జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం, ఇంచియాన్‌ ఆసియా క్రీడల్లో సత్యవర్త్‌ కాంస్యం గెలిచి సత్తాచాటాడు. భారీకాయుడైన సత్యవర్త్ 97 కేజీల విభాగంలో పోటీపడుతుంటాడు. వాస్తవానికి రియో ఒలింపిక్స్‌‌కు ముందే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ రియో ఒలింపిక్ క్రీడల కోసం దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా, 24 ఏళ్ల సాక్షి మాలిక్‌ కన్నా సత్యవర్త్‌ రెండేళ్లు చిన్నవాడు.

ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments