Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మశాల వన్డే : కోహ్లీ - పాండే రాణింపు.. భారత్ విజయభేరీ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ పర్యాటక జట్టు న్యూజిలాండ్‌పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంలో పాం

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2016 (19:58 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ పర్యాటక జట్టు న్యూజిలాండ్‌పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో బౌలింగ్ విభాగంలో పాండ్యా, బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ రాణించడంతో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 
 
అయితే, భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో కివీస్ జట్టు అతి 
తక్కువ స్కోర్‌కే పరిమతమైంది. ఒక దశలో 100 పరుగులు కూడా చేయలేరేమో అనుకున్నప్పటికీ 43.5 ఓవర్లలో 190 పరుగులు చేయగలిగి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు హర్ధిక్ పాండ్యా(3), ఉమేష్ యాదవ్‌(2)లు ఆదిలోనే వికెట్లు పడగొట్టి కివీస్ జట్టును బెంబేలెత్తించారు. 
 
మ్యాజిక్ స్పిన్నర్ అశ్విన్, మరో కీలక ఆటగాడైన జడేజా లేకపోయినప్పటికీ అద్భుత ప్రదర్శనతో యువ యౌలర్లు ఆకట్టుకున్నారు. అమిత్ మిశ్రా 3, కేదర్ జాదవ్ 2 వికెట్లతో అదరగొట్టారు. టీమిండియా సూపర్ బౌలింగ్‌కు న్యూజిలాండ్ ఆటగాళ్లు దాసోహమన్నారు. కేవలం టామ్ లాథమ్(79 నాటౌట్), టిమ్ సౌథీ(55)లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేయగా మిగిలినవారంతా అత్యల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 
 
అయితే, కివీస్ జట్టును టిమ్ సౌథీ తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 55 పరుగులు రాబట్టాడు. సౌథీతో పాటు ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచిన టామ్ లాథమ్ 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ రాణించాడు. 
 
అనంతరం 191 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఆడుతూపాడుతూ విజయలక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (14), రహానే (33) పరుగులతో రాణించి తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 
 
రోహిత్ శర్మ ఔట్ అయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ బ్యాట్‌కు పని చెప్పి (85) పరుగుల రాబట్టాడు. ఈ క్రమంలో మనీష్ పాండే (17), ధోనీ (21), జాదవ్ (10) చొప్పున పరుగుల చేయగా, భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి  మరో 101 బంతులు మిగిలివుండగానే 194 పరుగులు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యాన్ని సాధించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments