Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన పీవీ సింధు... గర్వపడుతున్నామంటూ కేటీఆర్ ట్వీట్

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (16:59 IST)
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. తన కెరీర్‌లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్ ఒకుహరపై 21-19, 21-17 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. 
 
మొత్తం గంటా రెండు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలో సింధు పైచేయిగా నిలించింది. గతేడాది ఫైనల్ చేరినా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్న సింధు.. ఈసారి మాత్రం టైటిల్ గెలవడం విశేషం. ఈ ఏడాది మొదటి నుంచీ సింధు టాప్ ఫామ్‌లో ఉంది. యమగుచి, తై జు యింగ్, రచనోక్‌లాంటి టాప్ ప్లేయర్స్‌పై వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన సింధు.. చివరి మ్యాచ్‌లోనూ అదే రేంజ్‌లో చెలరేగింది.
 
కాగా, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేత పీవీ సింధుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సింధుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. "నిన్ను చూసి గర్వపడుతున్నాం" అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments