Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు నువ్వే కట్టావుగా... షూస్‌ కూడా నువ్వే వెయ్యి.. భార్య కాళ్లకు చెప్పులు తొడిగిన ధోనీ

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (12:59 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి ధోనీతో కలిసి షాపింగ్‌లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో ఆయన తన భార్యకు చెప్పులు తొడుగుతూ కెమెరా కంటికి చిక్కాడు. అంతే.. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ చెప్పుల దుకాణానికి వెళ్లిన ఈ జంట, చెప్పులను పరీక్షించుకునే క్రమంలో ఇబ్బంది పడుతున్న సాక్షికి ధోనీ సహకరించాడు. కూర్చుని, ఆమె కాళ్లకు అవి సరిపోయాయో లేదో స్వయంగా చూస్తూ కాళ్లకు తొడిగాడు. అతనే స్వయంగా చెప్పుల బెల్టులు సర్దాడు. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన సాక్షి, "బిల్లు నువ్వే కట్టావుగా... షూస్‌ కూడా నువ్వే వెయ్యి" అని కామెంట్‌ చేసింది. 
 
షాపులో అందరి ముందూ బేషజాలు లేకుండా, మోకాళ్ళపై కూర్చొని తన భార్యకు ధోనీ చేసిన సాయాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపికైతే ఆస్ట్రేలియా వెళ్లి, జనవరి 12న జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

Jagan Birthday: జగన్‌కు నాగబాబు, చంద్రబాబుల పుట్టినరోజు శుభాకాంక్షలు

Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

Revanth Reddy:Allu Arjun కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా... ఓదార్పు ఎందుకు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

తర్వాతి కథనం
Show comments