Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌: ఫైనల్లో సైనా-సింధు తలపడతారా?

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. స్థానిక ప్లేయర్ 16వ సీడ్ క్రిస్టీ గిల్‌మోర్‌తో జరిగిన క్యార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో సైనా 21-19, 18-21, 21-15 తేడాతో విజయం

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (09:06 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. స్థానిక ప్లేయర్ 16వ సీడ్ క్రిస్టీ గిల్‌మోర్‌తో జరిగిన క్యార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో సైనా 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆద్యంతం సైనా మెరుగ్గా రాణించింది. తొలిగేమ్‌ను గెలిచి రెండో గేమ్‌ను ఓడినా.. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను సైతం సొంతం చేసుకుంది. తద్వారా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 
 
అంతకు ముందు తెలుగు తేజం, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు కూడా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్‌ షట్లర్ పీవీ సింధు అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి చైనా షట్లర్‌ సన్‌యూపై 21-14, 21-9తో సింధు గెలుపును నమోదు చేసుకుని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో రెండు సార్లు వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం అందుకుంది. తాజాగా సింధుకు మూడో సారి పతకం ఖాయం చేసుకుంది.
 
కాగా శనివారం జరిగే సెమీఫైనల్‌లో సైనా, సింధులు తమ తమ ప్రత్యర్థులతో మ్యాచ్ ఆడుతారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వీరిద్దరూ విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్‌లో ప్రత్యర్థులుగా తలపడతారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments