Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ నుంచి పీవీ సింధు అవుట్

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (19:49 IST)
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. బర్మింగ్‌హామ్‌లోని యుటిలిటా ఎరీనా వేదికగా రౌండ్‌-16 మ్యాచ్‌లో ఓడిపోయింది. 
 
చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ షట్లర్ అన్‌సే యంగ్ చేతిలో 21-19, 21-11 తేడాతో వరుస సెట్లలో సింధు ఓటమిపాలయ్యింది. 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్‌లో హోరాహోరీగా తలపడిన సింధు.. రెండవ సెట్‌లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. 
 
అంతకుముందు రౌండ్‌-32లో జర్మనీకి చెందిన షట్లర్ వోన్నే లీపై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. సింధు ఓటమితో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో ఆశలన్నీ స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉన్నాయి.
 
మరోవైపు డబుల్స్‌ విభాగంలో భారత టాప్ జోడీ సాత్విక్‌ - చిరాగ్ జోడి పురుషుల రౌండ్‌-16లో ఇండోనేషియా జంట మహమ్మద్ షోహిబుల్ ఫిక్రి-బగాస్ మౌలానాతో తలపడనుంది. 

సంబంధిత వార్తలు

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments