Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో రజతం.. బోనమెత్తిన సింధు.. సమంతకు గ్రీన్ ఛాలెంజ్..

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పీవీ సింధు ఆదివారం బోనమెత్తారు. సికింద్రాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ఆమె బోనం సమర్పించారు. ఆదివారం ఉదయం బోనం సమర్పించుకున్న తర్వాత ఆమె ప్

Webdunia
ఆదివారం, 12 ఆగస్టు 2018 (15:18 IST)
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పీవీ సింధు ఆదివారం బోనమెత్తారు. సికింద్రాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ఆమె బోనం సమర్పించారు. ఆదివారం ఉదయం బోనం సమర్పించుకున్న తర్వాత ఆమె ప్రత్యేక పూజలు చేశారు. బోనం సమర్పించేందుకు ఆలయానికి వచ్చిన సింధుకు ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. 
 
సింధు ఆలయానికి విచ్చేసిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఇక నగర వ్యాప్తంగా బోనాలు జోరుగా కొనసాగుతన్న సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినీ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ ప్ర‌ముఖులు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్క‌లు నాటుతూ మిగ‌తా సెల‌బ్రిటీల‌కి ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ క్ర‌మంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన పీవీ సింధు మూడు మొక్క‌లు నాటి హ‌రిత స‌వాల్‌ని మేరీ కోమ్, సూర్య, సమంతలకు పాస్ చేసింది.
 
ఇటీవ‌ల చైనాలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్‌లో పీవీ సింధు ర‌జ‌త ప‌త‌కం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే స‌మంత‌కి గ‌తంలో వంశీ పైడిప‌ల్లి గ్రీన్ ఛాలెంజ్ విస‌ర‌గా షూటింగ్ బిజీ వ‌ల‌న తాను ఇది స్వీక‌రించ‌లేక‌పోయింది. మ‌రి పీవీ సింధు ఛాలెంజ్‌నైన స‌మంత స్వీక‌రిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments