ఫైనల్‌లో పంచ్‌ల వర్షం - నీతూ ఘన విజయం.. మరో స్వర్ణం

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (20:16 IST)
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేసింది. బాక్సింగ్‌లో అందరూ ఊహించినట్లుగానే నీతూ ఘన్‌ఘాస్‌ దేశానికి గోల్డ్ మెడల్ అందించింది. మహిళల 48 కేజీల బరువు విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన బాక్సర్‌ను ఓడించింది. 
 
భారత బాక్సర్ పంచ్‌లకు ఇంగ్లండ్ బాక్సర్ వద్ద సమాధానం లేకపోయింది. మూడు రౌండ్ల పాటు సాగిన బాక్సింగ్‌లో మొదటి నుంచి చివరి వరకు నీతూ సత్తా చాటింది. మూడు రౌండ్లలో ఇంగ్లీష్ బాక్సర్ కంటే న్యాయమూర్తులు నీతూకి ఎక్కువ పాయింట్లు ఇచ్చారు. దీంతో ఈ క్రీడల్లో భారత్‌ తరపున నీతూ 14వ స్వర్ణం సాధించింది. 
 
ఇంగ్లిష్ బాక్సర్‌తో నీతూ చేసిన పోరాటం మూడు రౌండ్ల పాటు అద్భుతంగా సాగింది. ఇద్దరి మధ్య దూకుడు తారాస్థాయికి చేరుకుంది. మూడు రౌండ్లలోనూ నీతూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి రౌండ్‌లో ఐదుగురు జడ్జిలలో నలుగురు నీతూకి 10 పాయింట్లు ఇచ్చారు. రెండు, మూడు రౌండ్లలో కూడా ఇదే విధమైన ఫలితాలు కనిపించాయి. ఫలితంగా చివరికి న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు భారత బాక్సర్ నీతూకు అనుకూలంగా వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments