శెభాష్ నీరజ్ చోప్రా... ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు...

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (11:11 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్రపుట్టలకెక్కాడు. దీంతో నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కుపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా చేసిన పనికి ఇపుడు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. 
 
ప్రపంచ అథ్లెటిక్స్‌లో చారిత్రక వజియం తర్వాత స్టేడియంలోని అభిమానుల వద్దకు వెళ్ళిన నీరజ్.. అడిగిన వారితో ఫోటోలు దిగి, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనర్గళంగా హిందీ మాట్లాడుతున్న హంగేరీ దేశానికి చెందిన ఓ మహిళ.. నీరజ్‌ వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ కోరింది. దీనికి సరేనని నీరజ్ అంగీకరించాడు. 
 
అయితే, ఆమె భారత జాతీయ పతాకం ఇచ్చి సంతకం చేయమని కోరింది. కానీ, నీరాజ్ మాత్రం ఏమాత్రం ఆలోచన చేయకుండా.. త్రివర్ణ పతాకంపై ఆటోగ్రాఫ్ చేయనని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత ఆమె టీ షర్టుపై సంతకం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు నీరజ్ చోప్రాపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

తర్వాతి కథనం
Show comments