Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌ ధరెంతో తెలుసా?

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (20:53 IST)
Messi
అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ ఇటీవలే కాంట్రాక్ట్‌ పొడిగింపులో వచ్చిన సమస్యల వల్ల మెస్సీ స్పానిష్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. గత ఆదివారం(ఆగస్టు 8న) జరిగిన ఫేర్‌వెల్‌ వేడుకలో తన అనుభవాలను పంచుకుంటూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ఈ సందర్భంగా మెస్సీ ఒక టిష్యూ పేపర్‌తో ఉబికి వస్తున్న కన్నీళ్లతో పాటు ముక్కును తుడుచుకున్నాడు. 
 
సాధారణంగా వాడేసిన టిష్యూ పేపర్‌కు విలువ ఉండదు. ఇక్కడ టిష్యూను వాడింది మెస్సీ.. ఇంకేముంది అతను వాడిన టిష్యూ పేపర్‌ను తీసుకొని ఒక ప్రబుద్ధుడు ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడో లో వేలానికి పెట్టాడు. 
 
అయితే ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు సదరు వ్యక్తి ఫిక్స్‌ చేసిన ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ. ఏడున్నర కోట్లు ( 1 మిలియన్‌ డాలర్లు). ఇంకేముంది ఇది తెలుసుకున్న అభిమానులు ''వార్ని.. మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు ఇంత ధర'' అంటూ నోరు వెళ్లబెట్టారు.
 
13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 
 
బార్సిలోనా క్లబ్‌ను వీడిన మెస్సీ తాజాగా పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ (పీఎస్‌జీ)కి ఆడనున్నాడు. ఈ మేరకు అతడు ఫ్రెంచ్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండేళ్ల కాలానికి మెస్సీకి దాదాపు 7 కోట్ల యూరోలు (రూ. 610 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments