Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

భార్యాభర్తల మధ్య కొట్లాట.. అడ్డుపడినందుకు బంధువు బలి

Advertiesment
Husband
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:03 IST)
భార్యాభర్తల మధ్య కొట్లాటకు వారి బంధువు బలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాంధీనగర్‌ చోలపల్లానికి చెందిన సుబ్రమణి.. లారీ డ్రైవర్‌. అతని భార్య జీవిత. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో జీవిత తన పుట్టింటికి వెళ్లింది. అయితే ఆమె భర్త అత్తారింటికి వెళ్లి తన భార్యను కాపురానికి రావాలని కోరాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 
 
ఆగ్రహించిన సుబ్రమణి కంటైనర్‌ లారీ తీసుకొచ్చిన తన మామను గుద్దడానికి యత్నించాడు. అక్కడి వారు అది గమనించి ఆయన్ను తప్పించే ప్రయత్నంలో జీవిత అత్త కుమారుడైన జీవా (26)పై లారీ ఎక్కింది. దాంతో జీవాను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెం దాడు. స్థానికులు సుబ్రమణికి దేహశుద్ధి చేయగా అతను కూడా అదే ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరికీ హాని తలపెట్టం.. ఎవరి పనులు వారు చేసుకోవచ్చు : తాలిబన్లు