Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య వివాహేతర సంబంధం: వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

Advertiesment
భార్య వివాహేతర సంబంధం: వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:00 IST)
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తుందనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన కిన్నెర జాంబవంతుడు (32) రామనర్సయ్యనగర్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకుని నాలుగేళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు. 
 
ఈ నేపథ్యంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తూ జాంబవంతుడితో నిత్యం గొడవపడేది. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఓ కూతురు ఉంది. జాంబవంతుడు తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబూల్‌లో కర్ఫ్యూ.. నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా..?