Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న హైదరాబాదీ కుర్రాడు శ్రీకాంత్.. పతకం సాధిస్తాడా?

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో హైదరాబాదీ షట్లర్ శ్రీకాంత్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 23 ఏళ్లకే విశ్ర క్రీడల్లోకి ప్రవేశించిన ఈ కుర్రాడు..యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఇంకా బ్యాడ్మింటన్‌లో సంచలనాలక

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (10:26 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో హైదరాబాదీ షట్లర్ శ్రీకాంత్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 23 ఏళ్లకే విశ్ర క్రీడల్లోకి ప్రవేశించిన ఈ కుర్రాడు..యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఇంకా బ్యాడ్మింటన్‌లో సంచలనాలకు కేరాఫ్‌గా మారాడు శ్రీకాంత్. ఇపుడు రియోలో మెడల్ రేసులో దూసుకుపోతున్నాడు.

1993 ఫిబ్రవరి 7న గుంటూరులో పుట్టాడు శ్రీకాంత్. తండ్రి కేవీఎస్ కృష్ణ ల్యాండ్ లార్డ్… తల్లి రాధ హౌజ్ వైఫ్. పేరెంట్స్ ప్రోత్సాహం.. తన అన్న బ్యాడ్మింటన్ ప్లేయర్ నందగోపాల్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్‌ని కెరీర్ గా మార్చుకున్నాడు. గురువు గోపిచంద్‌ వద్ద పాఠాలు నేర్చుకున్న శ్రీకాంత్ పురుషులు సింగిల్స్ విభాగంలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 
 
15 ఏళ్లకే సబ్ జూనియర్ కెరీర్ మొదలుపెట్టాడు. 2011లో 18 ఏళ్ల వయసులో జూనియర్‌గా… కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొన్నాడు. అక్కడ్నించి మొదలైన శ్రీకాంత్ టైటిల్ రేసు సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ఈ ఐదేళ్లలో అద్భుతమైన, అనూహ్యమైన విజయాలెన్నో సొంతం చేసుకున్నాడు. ఇప్పటిదాకా 7 టైటిల్స్ ని సొంతం చేసుకున్నాడు.

వరల్డ్ బ్యాడ్మింటన్ లో గతేడాది జూన్ 4న 3వ ర్యాంకుతో కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకును సాధించిన క్రీడాకారుడిగా ఎదిగాడు. ప్రస్తుతం వరల్డ్ నెం.11 ర్యాంక్ తో రియోకు వెళ్లిన శ్రీకాంత్.. అద్భుతంగా పోరాడుతున్నాడు. శ్రీకాంత్ పతకాల పంట పండించాలని యావత్తు భారత దేశం ఆశిస్తోంది. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments