Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌లో పంజా విసిరిన జమైకా చిరుత.. స్వర్ణంతో మొనగాడుగా నిలిచాడు!

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో పరుగుల జమైకా చిరుత పంజా విసిరింది. స్వర్ణ పతకంతో మొనగాడుగా నిలిచాడు. 8 సంవత్సరాల క్రితం బీజింగ్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డును నిర్దేశిత సమయంలో పూర్తి చేసిన ఉస్సేన్ బ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (10:13 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో పరుగుల జమైకా చిరుత పంజా విసిరింది. స్వర్ణ పతకంతో మొనగాడుగా నిలిచాడు. 8 సంవత్సరాల క్రితం బీజింగ్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డును నిర్దేశిత సమయంలో పూర్తి చేసిన ఉస్సేన్ బోల్ట్.. స్ర్పింట్‌ కింగ్‌ ఖాతాలో మరో ఒలింపిక్‌ స్వర్ణం సాధించాడు.  గాయాలతో కెరీర్‌ ఒడిదుడుకులకు గురైనా.. విశ్వక్రీడల్లో పాల్గొంటాడో లేదో అన్న అనుమానాలు నెలకొన్నా.. ప్రత్యర్థుల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ఈ ప్రపంచంలో తనను ఓడించే మొనగాడు లేడని జమైకా వీరుడు మరోసారి నిరూపించుకున్నాడు. 
 
స్ర్పింట్‌ కింగ్‌, ప్రపంచంలోనే టాప్‌ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ వంద మీటర్ల పరుగుకు ముందు ట్రాక్‌పైకి రాగానే చూపుడు వేలును అభిమానులకు చూపిస్తూ తాను ప్రపంచ నెంబర్‌ వన్‌ అన్న విషయాన్ని గుర్తు చేశాడు. తమ అభిమాన ఆటగాడి పరుగును చూడ్డానికి వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు బోల్ట్‌ నామస్మరణతో స్టేడియాన్ని హోరెత్తించారు. 
 
కానీ, అందరిలో ఏదో మూల కొంత అనుమానం. ఈ సీజన్‌లో గాయాలతో సతమతమైన బోల్ట్‌ గెలుస్తాడా..? తన చిరకాల ప్రత్యర్థి జస్టిన్‌ గాట్లిన్‌, సహచరుడు యొహాన్‌ బ్లేక్‌ను దాటి స్వర్ణాన్నిసాధించుకుంటాడా అంటూ ఆత్రుతతో చూస్తుండిపోయారు. ఈ లోపు గన్‌ పేలనే పేలింది. దాని శబ్దం ఇంకా స్టేడియాన్ని దాటకముందే బోల్ట్‌ 100 మీటర్ల దూరాన్ని 9.81 సెకన్లలో పూర్తిచేశాడు. దీంతో జమైకా బోల్ట్ ఫ్యాన్స్ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇకపోతే.. ఒలింపిక్స్‌లో వరుసగా మూడోసారి 100 మీటర్ల పరుగులో చాంపియన్‌గా నిలిచిన జమైకా స్ర్పింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, క్రీడాకారులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. రియోలో సోమవారం బోల్ట్‌ పాల్గొన్న 100 మీటర్ల ఫైనల్‌ రేసును టీవీలో వీక్షించాడు. రేస్‌ ముగిసిన తర్వాత కోహ్లీ ట్విటర్‌లో బోల్ట్‌కు అభినందనలు తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments