Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే రోజున ప్రియుడికి తేరుకోలేని షాకిచ్చిన గుత్తా జ్వాలా

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (16:10 IST)
భారత టెన్నిస్ ఏస్ గుత్తా జ్వాలా తన పుట్టినరోజును శుక్రవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని తన ప్రియుడికి ఆమె తేరుకోలేని షాకిచ్చింది. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె ముందుగా చెప్పాపెట్టకుండా నేరుగా తన ప్రియుడి ఇంటికెళ్లింది. దీంతో ప్రియుడు విశాల్‌తో పాటు.. అతని తల్లిదండ్రులు సైతం ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత తేరుకుని ఆమె పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. 
 
నిజానికి గుత్తా జ్వాలా ఆట తీరుతో కంటే... వివాదాస్పద అంశాలతోనే మంచి పబ్లిసిటీ కొట్టేసింది. గతంలో ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా, అది పెటాకులైంది. తాజాగా హీరో విష్ణు విశాల్‌తో ఆమె ప్రేమలో ఉంది. ఇద్దరూ ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారు. విష్ణుతో జ్వాల సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
అయితే, శుక్రవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని విష్ణుకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. విష్ణు పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని అతని ఇంటికి ఆమె నేరుగా వెళ్లింది. చెప్పకుండా ఇంటికి వచ్చిన తన ప్రియురాలుని చూసిన విష్ణు సర్ ప్రైజ్ అయ్యాడు. 
 
ఆ రోజంతా విష్ణు ఇంట్లోనే జ్వాల గడిపింది. కేక్ కట్ చేయించి, పుట్టిన రోజు వేడుకలను నిర్వహించింది. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఆమెతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్

రండి మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దిగబెడతాం అని చెప్పి అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థుల పోటీ... కేజ్రీవాల్‌పై 23 మంది పోటీ...

ష్... నిశ్శబ్దంగా ఉండండి.. డిప్యూటీ సీఎం వివాదంపై జనసేన ఆదేశాలు

అధ్యక్ష పీఠంపై డోనాల్డ్ ట్రంప్ - అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

Dil Raju కార్యాలయాల్లో ఐటీ దాడుల్లోనూ అధికారులు తగ్గేదేలే, రహస్యమేమిటి?

తర్వాతి కథనం
Show comments