అవును మేమిద్దరం అది చేస్తున్నాం...

సోమవారం, 16 మార్చి 2020 (21:47 IST)
ప్రముఖులు డేటింగ్‌లో ఉండటం పెద్ద విషయమేమీ కాదు. సినీ ప్రముఖులైతే ఇక చెప్పనవసరం లేదు. డేటింగ్‌లలో మునిగి తేలుతుంటారు. ఇష్టముంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. లేకుంటే విడిపోతూ ఉంటారు. అయితే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల కూడా ప్రస్తుతం అదే చేస్తోంది.
 
సొంత అకాడమీ పెట్టుకుని తీరిక లేకుండా ఉన్న ఉన్న గుత్తాజ్వాల తమిళ నటుడు విష్ణు విశాల్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. అంతేకాదు డేటింగ్ కూడా చేస్తున్నానని ఆమే స్వయంగా చెబుతోంది. అవును... మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం. 
 
ఒకరినొకరు ఇష్టపడితే ఇక పెళ్ళి చేసుకోవడమే ఆలస్యం అంటోంది గుత్తాజ్వాల. అయితే నేను రాజకీయాల్లోకి రావాలని కొంతమంది నాపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని జాతీయ పార్టీలైతే నా చుట్టూనే తిరుగుతున్నాయి. నాకు రాజకీయం ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వారు మాత్రం నన్ను వదలడం లేదంటోంది గుత్తా జ్వాల. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం త్రిష అనుకుంటే.. కాజల్ కూడా షాక్ ఇచ్చింది, పాపం ఆచార్య