Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరజ్ చోప్రాకు వెల్లువెత్తుతున్న బహుమతులు.. ఇండిగో ఏడాదిపాటు..?

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (21:28 IST)
Neeraj Chopra
టోక్యో ఓలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి. తాజాగా బడ్జెట్ కారియర్ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఆ జాబితాలో చేరింది. విశ్వ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమితంగా ప్రయాణ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించింది.
 
మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పసిడి పతకాన్ని సాధించినందుకు గుర్తింపుగా ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు ఏడో తేదీ వరకు అపరిమితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. 
 
ఇండిగో సీఈవో కం హోల్‌టైం డైరెక్టర్ రొనోజోయ్ దత్తా ఈ సందర్భంగా స్పందిస్తూ.. నీరజ్ దేశానికి స్వర్ణ పతకాన్ని సంపాదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ విమానాల్లో మీరు ప్రయాణించడానికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అలాగే ఏడాది పాటు ఉచితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఇస్తామని వినయంతో తెలియజేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

తర్వాతి కథనం
Show comments