Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌లో పతకంతో వస్తా.. అలా కుదరకపోతే మాత్రం..?: సానియా మీర్జా

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు చెందిన జట్లు ఈ క్రీడోత్సవంలో పతకాల పంట పండించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మన దేశంలో వివిధ విభాగాల్లో క్ర

Webdunia
సోమవారం, 18 జులై 2016 (15:50 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు చెందిన జట్లు ఈ క్రీడోత్సవంలో పతకాల పంట పండించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మన దేశంలో వివిధ విభాగాల్లో క్రీడాకారులు ధీటుగా రాణిస్తారని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా టెన్నిస్‌లో సానియా, బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, బాక్సింగ్‌లో విజేందర్, షూటింగ్‌లో అభినవ్ బింద్రా రాణిస్తారని.. తద్వారా భారత్‌కు పతకాలు లభిస్తాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 
 
అయితే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాత్రం రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని తెలిపింది. ఒకవేళ రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించకపోతే.. మరో ఒలింపిక్స్‌లో పతకాల సాధన కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. రియో ఒలింపిక్స్‌లో పతకంతో దేశానికి తిరిగి రావాలనుకుంటున్నానని.. ఒకవేళ అది జరగకపోతే.. మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. 
 
కాగా సానియా మీర్జా రియో ఒలింపిక్స్‌లో ప్రార్థనా తొంబరేతో మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగనుండగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో కలిసి టెన్నిస్ కోర్టులో దిగనుంది. 

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments