Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో చాటుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫ

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (16:23 IST)
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో చాటుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 18-21, 21-9, 21-16 పాయింట్ల తేడాతో 11వ ర్యాంకర్ జపాన్ క్రీడాకారిణి సయాకా శాటోపై విజయం సాధించింది. తద్వారా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

తొలిగేమ్‌ను కోల్పోయినా.. మిగిలిన రెండు సెట్లలో మెరుగ్గా రాణించింది. ఆద్యంతం ప్రత్యర్థిపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా సైనాను విజయం వరించింది. 
 
ఫలితంగా రియో ఒలింపిక్స్ తర్వాత గాయం నుంచి కోలుకున్న సైనా నెహ్వాల్ తన ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు ప్రణయ్ 21-15, 11-21, 15-21 తేడాతో చాంగ్ వుయ్ ఫెంగ్(మలేషియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.

కానీ, సమీర్ వర్మ ప్రి-క్వార్టర్స్‌లో విజయం సాధించాడు. సమీర్ 19-21, 21-15, 21-11 తేడాతో కజుమసా సాకాయ్(జపాన్)పై గెలిచాడు. తద్వారా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

తర్వాతి కథనం
Show comments