Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీతో ఒలింపిక్ హాకీ హీరోలు: ఐస్ క్రీమ్, చూర్మాతో..? (video)

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (16:42 IST)
ఒలింపిక్ హాకీ హీరోలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఆగస్టు 16న ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అల్పాహార విందు ఇవ్వడం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతి క్రీడాకారులను ప్రధాని మోడీ విడివిడిగా పలకరించారు.

ఒలింపిక్స్ పర్యటన మధుర అనుభవాల గురించి క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు. ఒలింపిక్స్‌కు బయలుదేరి వెళ్లే ముందు పీవీ సింధుకు ఇచ్చిన మాట మేరకు ఆమెతో కలిసి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారు. అలాగే ఒలింపిక్స్‌తో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాతో చూర్మా ఎంజాయ్ చేశారు. 
 
ఒలింపిక్స్ పతకం గెలిచిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. తృటిలో పతకం చేజారిన క్రీడాకారులను ప్రోత్సహించారు. కాగా ఒలింపిక్స్ క్రీడాకారులతో ముచ్చటిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు. ఐస్ క్రీమ్, చూర్మాతో పాటు మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి ఒలింపిక్ క్రీడాకారులతో ముచ్చటించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మునుపెన్నడూ లేని స్థాయిలో ఏడు పతకాలు సాధించడం తెలిసిందే. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం సాధించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌తో పతకాలు సాధించిన క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది.

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments