Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఓపెన్‌లో సాన్‌టీనా జోడీకి చుక్కెదురు.. క్వార్టర్స్‌లో రోహన్ బోపన్న, పేస్ జోడీ!

Webdunia
మంగళవారం, 31 మే 2016 (13:32 IST)
గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలుచుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. వరుసగా నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలనుకున్న సానియా మీర్జా- మార్టినా హింగిస్ జంటకు ఫ్రెంచ్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 3-6, 2-6తో క్రెజ్‌సికోవా-సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో పరాజయం పాలైంది. 
 
ఇతపోతే.. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-కుద్రయెత్సెవా (రష్యా) జంట 6-2, 3-6, 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)-హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఖంగుతిన్నాడు. 
 
ఇక పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) 7-6 (7/5), 7-6 (7/4)తో జేమీ ముర్రే (బ్రిటన్)-బ్రూనో సొరెస్ (బ్రెజిల్)లపై… రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) 6-2, 6-7 (4/7), 6-1తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్)లపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి

పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా... ఎవరికీ చెక్ పెడతామండీ : మంత్రి నాదెండ్ల

ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుదారుల ఆందోళన... సర్దిచెప్పిన మాజీ ఎమ్మెల్యే!!

ఎయిర్ ఇండియా విమానం.. ఆకాశంలో గంటల పాటు చక్కర్లు.. మరుగు దొడ్ల సమస్యతో? (Video)

తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న అఘోరీని అర్థరాత్రి చితకబాదిన రాజేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

కన్నప్ప నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ ప్రేమ పాట

తర్వాతి కథనం
Show comments