Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ భారత పతక విజేతలకు ఉచిత విమాన ప్రయాణ ఆఫర్

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (12:28 IST)
టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తరపున పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను చూపించారు. ఫలితంగా ఇప్పటి వరకు ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 7 పతకాలతో స్వదేశానికి తిరిగివచ్చారు. 
 
అయితే, ఈ ఒలింపిక్ క్రీడల్లో పతకాలు నెగ్గిన భారత అథ్లెట్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని గో ఫస్ట్ (గతంలో గో ఎయిర్), స్టార్ ఎయిర్ విమానయాన సంస్థలు ఆఫర్ ప్రకటించాయి. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) స్వర్ణం సాధించగా, మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), రవి దహియా (రెజ్లింగ్) రజతాలు దక్కించుకున్నారు. పీవీ సింధు (బ్యాడ్మింటన్), భజరంగ్ పునియా (రెజ్లింగ్), లవ్లీనా బొర్గోహైన్ (బాక్సింగ్), పురుషుల హాకీ జట్టు కాంస్యాలు సాధించారు.
 
వీరందరికీ వచ్చే ఐదేళ్ల పాటు ఉచితంగా ప్రయాణించేందుకు టికెట్లు అందిస్తామని గో ఫస్ట్ ప్రకటించింది. భారత్‌కు 7 పతకాలు ఎప్పుడూ లభించలేదని, ఇది వేడుకలు చేసుకోవాల్సిన సమయం అని తెలిపింది. అందుకే 2025 వరకు వర్తించేలా ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్నామని గో ఫస్ట్ వివరించింది.
 
ఇక దేశీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ జీవితకాల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచినవారికి ఈ ఆఫర్ అందించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని స్టార్ ఎయిర్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, దేశీయంగా కూడా అనేక కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వివిధ రకాలైన అవార్డులు, రివార్డులను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

నాన్న డ్రమ్ములో ఉన్నాడు... తండ్రి హత్యపై ఆరేళ్ళ పాప నోట నుంచి వచ్చిన నిజం..

రోజూ కాసులిస్తేనే పక్కలోకి రండి - భార్య షరతు.. పోలీసులకు టెక్కీ ఫిర్యాదు

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Pawan Kalyan: అన్నయ్యకు యూకే అవార్డు.. సోదరుడు కాదు తండ్రి.. నా జీవితంలో రియల్ హీరో

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతంగా ఉంది... కానీ ఆ ఒక్క నిమిషం నిరాశపరిచింది : రాజమౌళి

తర్వాతి కథనం
Show comments