Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు చేరుకున్న పీవీ సింధు... ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపు

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:58 IST)
వరల్డ్ బ్యాడ్మింటన్ పోటి తుది ఫోరులో విశ్వవిజేతగా నిలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్ నగరానికి చేరుకుంది. తొలుత ఢిల్లీకి చేరుకున్న ఆమె మొదట కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా సింధును అభినందించిన రిజిజు, సింధు స్ఫూర్తితో మరింత మంది బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించాలని పిలుపునిచ్చారు.
 
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్న సింధు, అటునుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక్కడ ఆమెకు ఘనస్వాగతం పలుకనున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఆమెను గచ్చిబౌలి వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. 
 
అంతకుముందు ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 'ఓ భారతీయురాలిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇదో గొప్ప మెడల్. నాకు ప్రతి క్షణమూ సహకరించిన కోచ్‌కి కృతజ్ఞతలు' అని వ్యాఖ్యానించింది. 
 
కాగా, ఏకపక్షంగా సాగిన ఫైనల్ పోరులో గెలిచి, వరల్డ్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుని తొలి భారతీయురాలిగా సింధూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్‌కు చేరుకునే సింధూకు రాష్ట్ర బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌తో పాటు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments