Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధును చిత్తు చేసిన జపాన్ క్రీడాకారిణి

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (11:58 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. కెనడాలోని కాల్గరీలో జరుగుతున్న కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టోర్నీలో సెమీఫైనల్లో చిత్తుగా ఓడిపోయింది. అయితే, యువ షట్లర్ లక్ష్యసేన్ మాత్రం పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరుకున్నాడు. 
 
ఆదివారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి 21-14, 21-15తో పీవీ సింధును వరుస గేమ్స్‌లో ఓటమిపాలయ్యారు. దాంతో, చాన్నాళ్లుగా ఓ టైటిల్ ఆశిస్తున్న సింధుకు మరోసారి నిరాశ తప్పలేదు.
 
మరోవైపు, లక్ష్యసేన్ దాదాపు ఏడాది తర్వాత తొలి బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-17, 21-14తో జపాన్‌కు చెందిన స్టార్ షట్లర్, నాలుగో సీడ్ కెంటా నిషిమోటోపై వరుస గేమ్స్‌లో అద్భుత విజయం సాధించాడు. ఫైనల్లో అతను చైనాకు చెందిన లీ షిఫెంగ్‌తో పోటీ పడనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments