భారత్‌కు మరో పతకం.. భజరంగ్ పునియాకు కాంస్యం

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (17:17 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత్‌కు మరో పతకం వచ్చింది. భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్యం సాధించాడు. శనివారం మధ్యాహ్నం కాంస్యం కోసం జరిగిన పోరులో భజరంగ్ 8-0తో కజకిస్థాన్‌కు చెందిన దౌలత్ నియాజ్ బెకోవ్‌ను చిత్తు చేశాడు. 
 
పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరులో భజరంగ్ పునియా తన స్థాయికి తగిన ప్రదర్శన కనబరిచాడు. సెమీఫైనల్లో ఓటమి అనంతరం కుంగిపోకుండా, ఈ మ్యాచ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి భారత్ ఖాతాలో ఆరో పతకాన్ని చేర్చాడు. భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా 2 రజతాలు, 4 కాంస్యాలు లభించాయి.
 
భజరంగ్ పతక సాధనపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టోక్యో నుంచి సంతోషకరమైన వార్త అందిందని తెలిపారు. భజరంగ్ కళ్లు చెదిరే పోరాటం కనబర్చాడని కితాబునిచ్చారు. "ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసే విజయం సాధించినందుకు నీకు శుభాభినందనలు" అంటూ భజరంగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
 
కాగా, పునియా విజయంతో భారత శిబిరంలో సంబరాలు షురూ అయ్యాయి. ఈ గెలుపుపై భజరంగ్ పునియా తండ్రి బల్వాన్ సింగ్ స్పందిస్తూ తన కలను కుమారుడు నిజం చేశాడని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కాంస్య పతకం తనకు స్వర్ణ పతకంతో సమానమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments