Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌ 2016: ఇంద్రజీత్ సింగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడా? నాలుగేళ్ల పాటు నిషేధం?

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులందరూ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో భారత క్రీడాకారులు సైతం సమరానికి సై అంటున్నారు. కానీ భారత అథ్లెట్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం క్రీడాభిమా

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (13:10 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులందరూ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో భారత క్రీడాకారులు సైతం సమరానికి సై అంటున్నారు. కానీ భారత అథ్లెట్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమవడం క్రీడాభిమానులకు కలవరపాటుకు గురిచేస్తోంది. భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికిన రెండు రోజుల వ్యవధిలోనే తాజాగా మరో భారత షాట్‌పుట్ క్రీడాకారుడు ఇంద్రజీత్‌సింగ్ డోప్ పరీక్షలో ఫెయిల్ కావడంతో క్రీడాభిమానులు నిరాశ చెందుతున్నారు. 
 
తాజాగా జూన్ 22న నిర్వహించిన డోప్ పరీక్షలో ఇంద్రజీత్ పట్టుబడినట్లు సమాచారం. అయితే డోపింగ్ పరీక్ష ఫలితంపై స్పందించిన ఇంద్రజీత్ తన పట్ల ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. కావాలంటే తన ‘బి’ శ్యాంపిల్‌ను పరీక్ష చేయాలని కోరాడు. కాగా, మంగళవారమే ఇంద్రజీత్ ‘బి’ శ్యాంపిల్‌ను ఢిల్లీలో పరీక్షించనున్నట్లు సమాచారం. ఇక బి శ్యాంపిల్ కూడా పాజిటీవ్‌గా తేలితే, ఇక ఇంద్రజీత్ సింగ్ ఒలింపిక్స్ ఆశలు వదులుకోవాల్సిందే. ఒకవేళ ''బి" శ్యాంపిల్‌లో కూడా పాజిటివ్ అని తేలితే వరల్డ్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ చట్టం ప్రకారం నాలుగేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

అప్రమత్తంగా ఉండండి: సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం, నాశనం చేస్తే చట్టపరమైన చర్యలు

దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకంటే.. పవన్‌పై అలా?

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

తర్వాతి కథనం
Show comments