Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయ్ సెంటరులో దారుణం : హాకీ క్రీడాకారిణిపై అత్యాచారం ... నలుగురు అరెస్టు

ఠాగూర్
మంగళవారం, 22 జులై 2025 (19:36 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. 15 యేళ్ళ యువ హాకీ క్రీడాకారిణిపై నలుగురు కోచ్‌లే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాయ్ సెంటరులోనే బాధితురాలు రెండేళ్లుగా శిక్షణ పొందుతోంది. ఆమెకు శిక్షణ ఇచ్చే కోచ్‌‍లో ఈ దారుణానికి తెగబడ్డారు. జిల్లాలోని రూర్కెలాలోని సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సెంటరులో చోటుచేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. జూలై మూడో తేదీ సాయంత్రం స్థానిక స్టేడియంలో కోచింగ్ సెషన్ ముగిసిన తర్వాత నలుగురు కోచ్‌లు, ఆ క్రీడాకారిణిని ఒక లాడ్జీకి తీసుకెళ్లి, లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయంపై ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. జూలై 21వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని నలుగురు కోచ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై బీఎన్ఎస్‌లోని వివిధ సెక్షన్లతో పాటు సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేశారు. సోమవారం కోర్టులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సంఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments