Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్మెంట్ యోచనలో సైనా నెహ్వాల్.. సెలెబ్రిటీ హోదా కోసం బ్యాడ్మింటన్‌ను పక్కనబెట్టేసిందా?

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. రియో ఒలింపిక్స్ నుంచి మోకాలి గాయంతో లీగ్ దశలోనే నిష్కృమించిన సైనా నెహ్వాల్.. ఈ నెల 15వ తే

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (12:16 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. రియో ఒలింపిక్స్ నుంచి మోకాలి గాయంతో లీగ్ దశలోనే నిష్కృమించిన సైనా నెహ్వాల్.. ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీకి ప్రాక్టీసు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన భవిష్యత్ లక్ష్యాలను తానేమీ నిర్దేశించుకోలేదని స్పష్టం చేసింది. 
 
చాలామంది తన కెరీర్ ముగిసిపోయినట్లు వ్యాఖ్యానిస్తున్నారని.. గుండె లోత్తుల్లోంచి ఆలోచిస్తే తనకు కూడా అలాగే అనిపిస్తుందని సైనా వ్యాఖ్యానించింది. అయితే ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దామని సస్పెన్స్ పెట్టింది. సాధ్యమైనంత వరకు మెరుగ్గా ఆడేందుకు తీవ్రంగా కృషి చేస్తానని.. కానీ ఇప్పటికే తన పనైపోయిందని అందరూ అనుకుంటున్నట్లు వెల్లడించింది. వారు అలా అనుకోవడం కూడా తనకు హ్యాపీయేనని వెల్లడించింది.
 
సైనా వ్యాఖ్యలను క్రీడా పండితులు ఏం చెప్తున్నారంటే.. సైనా గాయాలతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినట్లుందని చెప్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో అగ్ర క్రీడాకారిణిగా ఓ వెలుగు వెలిగిన సైనా తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అలా మాట్లాడి వుంటుందని అంటున్నారు. కానీ ఆమెకు సెలెబ్రిటీ హోదా కోసం బ్యాడ్మింటన్‌ను పక్కనబెట్టాలనుకుంటుందని.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సైనా.. బయోపిక్‌పై దృష్టి పెట్టి క్రీడల్ని పక్కనబెట్టేసిందని కొందరు విమర్శిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments