Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సెక్స్ బుల్ దూకుడు.. 60 వేల మార్క్‌ను దాటేసింది..

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (11:03 IST)
భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 60 వేల పాయింట్ల మైలు రాయిని దాటింది. దీంతో మన మార్కెట్ల చరిత్రలో సెప్టెంబర్ 24వ తేదీన దేశ చరిత్రలో ఒక మరుపురాని రోజుగా నిలిచిపోయింది. అలాగే, నిఫ్టీ సైతం దూకుడు ప్రదర్శించింది. ఫలితంగా 18 వేల మార్కును టచ్ చేసే దిశగా పరుగులు పెడుతోంది. 
 
మరోవైపు, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నప్పటికీ భారత మార్కెట్లు మాత్రం జోష్‌లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం మన మార్కెట్లలో ర్యాలీ కొనసాగడానికి కారణమవుతోంది. 
 
ప్రస్తుతం సెన్సెక్స్ 424 పాయింట్ల లాభంతో 60,292 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 17,925 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఏసియన్ పెయింట్స్, భారతి ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments