‘ముక్కనుమ’ నాడు సావిత్రి గౌరీదేవి వ్రతం చేస్తే...?

కనుమ మరుసటి రోజుని 'ముక్కనుమ'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు. సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవతను గూర్చి వరహ, బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలు, దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (20:03 IST)
కనుమ మరుసటి రోజుని 'ముక్కనుమ'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు. సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవతను గూర్చి వరహ, బ్రహ్మవైవర్త, పద్మ పురాణాలు, దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. 
 
ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు, తాంబూలం వాయనంగా ఇస్తారు. 
 
ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు. కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు. ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కాపురంలో కలహాలు.. సినీ ఫక్కీలో భార్య స్కెచ్.. అదృష్టం బాగుండి భర్త..?

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

కోటి సోమవారం అంటే ఏమిటి?

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

తర్వాతి కథనం
Show comments