Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 లో బిగ్గెస్ట్ ఆర్.వో.ఐ(రిటర్న్ ఆన్ ఇన్వెస్టిమెంట్) హిట్ మూవీగా నిలిచిన బేబి

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (18:04 IST)
baby R.V.O. poster
2023 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో "బేబి" సినిమా ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను రూపొందించారు. బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది. 
 
చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయం సాధించడం, రా అండ్ రస్టిక్, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో ప్రేమకథతో సక్సెస్ అందుకోవడం బేబి సినిమా ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి...మొత్తం సౌత్ లో సూపర్ సక్సెస్ అందుకుంది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో 50 కోట్ల గ్రాసింగ్ హిట్ అందుకుంటే...ఆనంద్ దేవరకొండ బేబితో 100 కోట్ల గ్రాసింగ్ మూవీ క్లబ్ లో చేరారు. బేబి తెలుగుతో పాటు రెస్టాఫ్ ఇండియాలో సూపర్బ్ కలెక్షన్స్ దక్కించుకుంది. కల్ట్ బొమ్మగా బేబి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు బాలీవుడ్, తమిళం ఇతర భాషల నుంచి రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. త్వరలోనే బాలీవుడ్ లో బేబి రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.
 
ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ డిజైనింగ్ నుంచి సక్సెస్ మీట్స్ వరకు చేసిన అగ్రెసివ్ ప్రమోషన్ బేబి మూవీని ప్రతి గ్రామంలోని ప్రేక్షకుడి దగ్గరకు చేర్చింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్  బేబి సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేసి ఓ మంచి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లే కల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది బేబి. ఈ ఏడాది టాలీవుడ్ కు ఓ గుర్తుండిపోయే సినిమాగా మారింది. రీమేక్ ద్వారా బాలీవుడ్ లోనూ ఇంతకుమించిన సక్సెస్ దక్కుతుందని ఆశిస్తున్నారు బేబి మేకర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments